చక చక సాగే చక్కని బుల్లెమ్మా
మిస మిస లాడే వన్నెల చిలకమ్మ
నీ పేరేమిటో .. నీ ఊరేమిటో
నీ పేరేమిటో .. నీ ఊరేమిటో
గలగల పారే ఏరే నా పేరూ
పొంగులు వారే వలపే నా ఊరూ
చినదాననూ..నే చినదాననూ
చినదాననూ..నే చినదాననూ
కన్నులు చెదిరే వన్నెల చిలకా..నీ వయసే ఎంతా
కన్నులు చెదిరే వన్నెల చిలకా..నీ వయసే ఎంతా
చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంతా..ఊహకు రానంత !
అందీ అందక ఊరించే నీ మనసులోతెంతా..హా !
మమతే ఉంటే..దూరమెంతో లేదూ
నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది
కసి కసి చూపులు చూసే సోగ్గాడా
ముసి ముసి నవ్వులు విరిసే మొనగాడా
నీ పేరేమిటో .. నీ ఊరేమిటో
నీ పేరేమిటో .. నీ ఊరేమిటో
పదమును పాడే వేణువు నా పేరూ
మధువులు చిందే కవితే నా ఊరూ
చినవాడనూ..నే నీవాడనూ
చినవాడనూ..నే నీవాడనూ
వరసలు కలిపే ఓ చినవాడా..నీ వలపే ఎంతా
విలువే లేనిది..వెలకే రానిది..వలపే కొండంత..నా వలపే జీవితమంత !
నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంటా..హో
గుండెల గుడిలో దేవివి నీవంటా..
సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంటా
చల్లని గాలీ సన్నాయి ఊదిందీ
పచ్చిక వెచ్చని పానుపు వేసిందీ
కల నిజమైనదీ..ప్రేమ ఋజువైనదీ
కల నిజమైనదీ..ప్రేమ ఋజువైనదీ
చిత్రం : మల్లెపువ్వు (1978)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల
**************************************
Movie Name : Mallepuvvu (1978)
Music Director : Chakravarthy
Lyricist : Veturi
Singers : S.P.Balasubramanyam, P.Suseela