మానూ మాకును కాను
రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నేను.. నీ మనిషిని నేను..
మానూ మాకును కాను
రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నేను.. నీ మనిషిని నేను..
నాకూ ఒక మనసున్నాదీ నలుగురిలా ఆసున్నాదీ
నాకూ ఒక మనసున్నాదీ నలుగురిలా ఆసున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయి ...కలలు కనే కళ్ళున్నాయి ...
అవి కలత పడితే నీళ్ళున్నాయి
మానూ మాకును కాను
రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నేను.. నీ మనిషిని నేను..
ప్రమిదను తెచ్చీ వొత్తిని యేసీ చమురును పోసీ భ్రమ చూపేవా
ప్రమిదను తెచ్చీ వొత్తిని యేసీ చమురును పోసీ భ్రమ చూపేవా
ఎంత చేసీ వెలిగించెందూకూ యెనక ముందులాడేవా
మానూ మాకును కాను
రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నేను.. నీ మనిషిని నేను..
మనిసితోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మామా యిరిగిపోతే అతకదు మళ్ళా
మానూ మాకును కాను
రాయీ రప్పను కానే కానూ
మామూలు మనిషిని నేను.. నీ మనిషిని నేను..
చిత్రం : మూగమనసులు (1964)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : పి.సుశీల
****************************************
Movie Name : Mooga Manasulu (1964)
Music Director : K.V.Mahadevan
Lyricist : Acharya Aathreya
Singer : P.Susheela