నిన్న చూసిన ఉదయం కాదిది
కొత్తగా వుంది సరికొత్తగా వుంది
ఇంత వరకు ఇన్ని వింతలు ఎక్కడ దాచింది
కొత్తగా వుంది సరికొత్తగా వుంది
నిన్న చూసిన ఉదయం కాదిది
చురుకు మంటూ పొడిచి లేపే సూర్య కిరణం ఈ వేళ
కలువ విరిసే చలువ కురిసే కలలు చూపింది
వేడి గాలై వెంట తరిమే ఎండ కాలం ఈ వేళ
ఏడు రంగుల ఇంద్ర ధనువై ఎదుట నిలిచింది
ఈ మాయ మర్మం నాదందువా
నీలోని భావమే కాదందువా
ఈనాడే కలిగిన నీ మెలకువ చూపించేనేమో తొలి వేకువ
ఈ సుప్రభాతం వినిపించు గీతం నీ గుండెలోనే లేదందువా
నిన్న చూసిన ఉదయం కాదిది
నిన్న చూసిన ఉదయం కాదిది
మంత్రమేవరో వేసినట్టు మట్టి బొమ్మే ఈ వేళ
నమ్మలేని నాట్యకళతో నడిచి వచ్చింది
మాయ ఏదో జరిగినట్టు మంచు ఋతువే ఈ వేళ
వేల వన్నెల పూలు తొడిగి పలకరించింది
నీ కంటి ముందర ఈ రంగులు
నీలోనే దాగిన శ్రీకాంతులు
నీ గుండె ముంగిట ఈ ముగ్గులు
నీ ఉహలోనే సంక్రాంతులు
ఈ నవ్వే చిత్రం నీ నవ్వే చైత్రం
సత్యం శివం సుందరం ..
నిన్న చూసిన ఉదయం కాదిది
కొత్తగా వుంది సరికొత్తగా వుంది
ఇంత వరకు ఇన్ని వింతలు ఎక్కడ దాచింది
కొత్తగా వుంది సరికొత్తగా వుంది
నిన్న చూసిన ఉదయం కాదిది
చిత్రం : చిన్నబ్బాయి (1997)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం