పల్లవి:
పూత వేసిన లేత మావిని చూసినట్టుంది
నువ్వు నవ్వుతూ ఉంటే...
పాత పాటలు కొకిలమ్మే పాడినట్టుంది
నీ పలుకు వింటుంటే...
మాటలే వరదలై ఉరకలేస్తునవి
చెంత నువ్వుంటే...
ఉంటే...
//పూత వేసిన//
చరణం : 1
మునుపు కలగని మురిపెమేదో ముద్దుగా నా ముందరుంది
అలుపు తెలియని వలపు నాలో హద్దులే చెరిపేయమంది
లేనిదేది నాకు లేదను తలపు ఉండేది
ఇంతలో నీ పరిచయం ఒక లోటు తెలిపింది
నువ్వే కావాలని,కలవాలని,కలగాలని
ప్రియా నా ప్రాణమే మారాము చేసింది
సగపసగరినిసగపనిసనిదపగమదపసగరిగ..
అంటూ....
చరణం : 2
పోత పోసిన పసిడి బొమ్మే కదిలినట్టుంది
నువ్వు నడచి వస్తుంటే....
కోత కోసిన గుండె నాలో మిగిలి ఉంటుంది
నను విడిచి వెళుతుంటే...
మాటలే మౌనమై ఉసురు తీస్తున్నవి
ఒంటరై ఉంటే.....
పూత వేసిన లేత మావిని చూసినట్టుంది
కుదురు దొరకని ఎదురు చూపే కొంటెగ వెంటాడమంది
నిదుర కుదరని కంటిపాపే వెంటనే నిను చూడమంది
ఏమిటో నా తీరు నాకే కొత్తగ ఉంది
ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉంది
నిరీక్షణ చాలని ఇక చాలని అడగాలని
చెలి నా ఊపిరి నిను చేరుకుంటుంది
ననననననననన..........
అంటూ.....
చేతికందని చందమామే అందినట్టుంది
నువ్వు తాకుతూ ఉంటే...
చోటు ఇమ్మని చుక్కలేవొ అడిగినట్టుంది
నను తోడు రమ్మంటే .....
మాటలే కవితలై మురిసిపోనున్నవి
జంట నువ్వైతే....
ఐతే....
పూత వేసిన లేత మావిని చూసినట్టుంది
చిత్రం : సంగమం (2007)
సంగీతం : M.M.కీరవాణి
రచన : అనంత శ్రీరామ్
గానం : M.M.కీరవాణి , ప్రణవి
********************************************
Movie Name : Sangamam (2007)
Music Director : M.M.Keeravani
Lyricist : Anantha Sriram
Singers : M.M.Keeravani, Pranavi