అనుపమ ఆనంద ..అమృతమా ఇది....
సంకల సంధ్యానమలయ స్వ??మమా ఇది
తోం తోం తనన తోంత ధిరనన..
తోం తోం తనన తోంత ధిరనన ..
తోం తోం తనన తోంత ధిరనన ...
స్వరాల వరాల తరాల స్వనాల మధురిమలోన
ఇహాన పరాన భవాన సుమాల వెన్నెలవాన
వికాస ప్రకాశ విధాత విలాస హాసములోన
విశాల విహార విశేష విసర్గ నిర్మలమైన
కని పెంచే అమ్మ తెలుగు
వికసించే వెలుగు తెలుగు
పులకించే పలుకు తెలుగు
తేజోమయం ||స్వరాల వరాల..||
ఖండలా దాటి తెలుగు
సాగరమై పొంగు తెలుగు
నిండైన బాస తెలుగు
జగమై
మిన్నంటి మనసు తెలుగు
నిజమైన తేట తెలుగు
నిలుచునులే జాణు తెలుగు
ఇలలో...
నా మాటగా నీ పాటగా
మన పాటగా మనసారగా
హరివిల్లుగా విలసిల్లగా
మన భాషరా.... ||స్వరాల వరాల..||
ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..
ఏదేశమేగినా ఎందుకాలిడినా..తల్లీ భారతేరా..
గుసగుసలా గుండె తెలుగు
మిసమిసల మోము తెలుగు
పదనిసల పదము తెలుగు
మెరుపై...
మేఘాలా తేలి తెలుగు
తొలకరిలో చినుకు తెలుగు
తేనియలా తీపి తెలుగు
మనదై..
నా కవితగా రసభరితగా
మన భవితగా ఘన చరితగా
అదిపాడగా ముదమారగా
మన భాషరా.... ||స్వరాల వరాల..||
చిత్రం : తేజం (2009)
సంగీతం : గణ
రచన : జొన్నవిత్తుల శ్రీరాం
గానం : చిత్ర