ఏమని నే .. చెలి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
తోటలలో .. పొదమాటులలో .. తెర చాటులలో
ఏమని నే .. మరి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
నవ్వు .. చిరునవ్వు .. విరబూసే పొన్నలా
ఆడు .. నడయాడు .. పొన్నల్లో నెమలిలా
పరువాలే పార్కుల్లో .. ప్రణయాలే పాటల్లో
నీ చూపులే నిట్టూర్పులై .. నా చూపులే ఓదార్పులై
నా ప్రాణమే నీ వేణువై .. నీ ఊపిరే నా ఆయువై
సాగే .. తీగసాగే .. రేగిపోయే .. లేత ఆశల కౌగిట
ఏమని నే .. మరి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
చిలకా .. గోరింకా .. కలబోసీ కోరికా
పలికే .. వలపంతా .. మనదేలే ప్రేమికా
దడపుట్టే పాటల్లో .. నీ దాగుడు మూతల్లో
నవ్విందిలే బృందావనీ .. నా తోడుగా ఉన్నావని
ఊగే .. తనువులూగే .. వణకసాగే .. రాసలీలలు ఆడగ
ఏమని నే .. మరి పాడుదునో
తొలకరిలో .. తొలి అల్లరిలో .. మన అల్లికలో
ఏమని నే .. చెలి పాడుదునో
తికమకలో .. ఈ మకతికలో
చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు (1983)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి