గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ
గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ..
ఎటో వెళ్ళిపోయే మేఘమా ఆగవే
గూటిలో గువ్వనీ..నీటిలో చేపనీ..
పలకరించి పోదాం నాకు తోడై సాగవే
ఓ ..నింగి నేల ఏకం అయ్యే చోటే చూసొద్దాం
గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ..
ఎటో వెళ్ళిపోయే మేఘమా ఆగవే
ఆకుపచ్చ పట్టుకోక కట్టుకున్న చిలకమ్మా .. ఇలా వచ్చి హలొ చెప్పి పోవా
రెక్క విప్పి దూసుకెళ్ళు గారాల తుమ్మెదా..నన్ను నీతో తీసుకెళ్ళిపోవా
మావి చిగురు మేసే ఓ కోయిలమ్మా..నీ పాట నాకు నేర్పాలమ్మా
వసంతాల వన్నెలన్ని నీతో చూడాలే
గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ..ఎటో వెళ్ళిపోయే మేఘమా ఆగవే
గుండెలోన కుంచె ముంచి కోటి కోటి రంగుల్ని దిద్దినట్టి చిత్రకారుడెవరో
మేలమాడు గాలిలోన కొంగొత్త రాగాలు మేళవించు నాదబ్రహ్మలెవరో
ఓ..ఈ పూల పక్కా వేసింది ఎవరో..ఆ కలువ తాపం తీర్చేదెవరో
నిన్న లేని అందమేదో నేడే చూసాలే
గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ..ఎటో వెళ్ళిపోయే మేఘమా ఆగవే
ఓ ..నింగి నేల ఏకం అయ్యే చోటే చూసొద్దాం
చిత్రం : ఒరేయ్.. పండు (2005)
సంగీతం : ఆనంద్ రాజ్ ఆనంద్
రచన : భువనచంద్ర
గానం : శ్రేయా ఘోషల్
***********************************
Movie Name : Orey Pandu (2005)
Music Director : Anand Raj Anand
Lyricist : Bhuvanachandra
Singer : Shreya Ghoshal