ఏమైందో గానీ చూస్తూ చూస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసేలా.
ఏం మాయ వల వేస్తూ వేస్తూ ఏ దారి లాగుతూ ఉందో తననలా..
అదుపులో ఉండదే చెలరేగే చిలిపితనం.
అటు ఇటు చూడదే గాలిలో తేలిపోవడం.
అనుమతి కోరదే పడి లేచే పెంకితనం.
అడిగినా చెప్పదే ఏమిటో అంత అవసరం.
ఏం చేయడం మితిమీరే ఆరాటం. తరుముతూ ఉంది ఎందుకిలా.
// ఏమైందో గానీ చూస్తూ చూస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసెలా.. //
చరణం 1:
తప్పో ఏమో అంటుంది - తప్పదు ఏమో అంటుంది
తడబాటు తేలని నడక - కోరే తీరం ముందుంది
చేరాలంటే - చేరాలి కదా బెదురుతూ నిలబడక
సంకెళ్ళుగా సందేహం బిగిసాక - ప్రయాణం కదలదుగా
కలలా అలాగా మది ఉయ్యాల ఊపే భావం ఏమిటో పోల్చుకో త్వరగా..
చరణం 2:
లోలో ఏదో నిప్పుంది - దాంతో ఏదో ఇబ్బంది
పడతావటే తొలి వయసా - ఇన్నాళ్ళుగా చెప్పంది
నీతో ఏదో చెప్పింది కదా - అది తెలియదా మనసా
చన్నీళ్ళతో చల్లారను కాస్తైనా - సంద్రంలో రగిలే జ్వాల
చినుకంత ముద్దు - తనకందిస్తే చాలు అంతే!
అందిగా అంతేగా తెలుసా..
ఏం మాయ వల వేస్తూ వేస్తూ
ఏ దారి లాగుతూ ఉందో తననలా..
అదుపులో ఉండదే చెలరేగే చిలిపితనం -
అటు ఇటు చూడదే గాలిలో తేలిపోవడం
అనుమతి కోరదే పడి లేచే పెంకితనం
అడిగినా చెప్పదే ఏమిటో అంత అవసరం
ఏం చేయడం మితిమీరే ఆరాటం -
తరుముతూ ఉంది ఎందుకిలా
// ఏమైందో గానీ చుస్తూ చుస్తూ చేజారి వెళ్ళిపోతోంది మనసెలా.. //
చిత్రం : నేను మీకు తెలుసా (2008)
సంగీతం : అచ్చు
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్రీరామ్ పార్థ సారధి