సాకీ :
ఒక్క క్షణం... ఒక్క క్షణం...గరిమల నీ మురిపెపు ముద్దుల మొలకొచ్చేదికఒక్క క్షణం... ఒక్క క్షణం...పల్లవి : అమ్మకడుపు చల్లగా అయ్యకలలు పండగాఇమ్మనరే... ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరముఈ లాలికి స్వరము ఇహము పరము॥చరణం : 1
కౌసల్యకు తప్పని అమ్మవేదన మన రామకీర్తనరామం దశరథ రామం దనుజ విరామం ధరణిజ సోమం॥దేవకికే తప్పని చెరసాల వేదన నవరసాల నర్తననంద నందనం భక్త చందనం గోపికా గోవందనం॥గగప రిరిగ సాదసాసరిగరి పదపాగరిగప దపాదపా సదా గసరి సారి గరీగగ రిరి సస రిరి సస దద సదాపగారిసారిగాతూరుపు తల్లికి తప్పదు ఉదయవేదనమేఘాలకు తప్పదుమెరుపు వేదన ఒక్క క్షణం... ఒక్క...॥॥చరణం : 2
కల్లోలపు కడలి మీద తాను తేలగా వటపత్రశాయిగాతొమ్మిది మాసాల యోగి కెవ్వుకెవ్వున తొలికేక పెట్టగాశోకంలో పుట్టెనంట రామాయణము శోకంలో పుట్టెనంట రామాయణము శ్లోకంగా పెరుగునంట జన్మల ఋణముఆ ఋణానుబంధమే ఈ శిశు జననం ॥జో అచ్యుతానంద జోజో ముకుందాలాలి పరమానంద రామగోవిందా జోజో...చిత్రం : స్వరాభిషేకం (2004)
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : విద్యాసాగర్
గానం : ఎస్.పి.బాలు, శైలజ