ప్రకృతి కాంతకు యెన్నెన్ని హొయలో
పదము కదిపితె యెనెన్ని లయలో
ప్రకృతి కాంతకు యెన్నెన్ని హొయలో
పదము కదిపితె యెనెన్ని లయలో
యెన్నెన్ని హోయలొ యెనెన్ని లయలో
యెన్నెన్ని హోయలొ యెనెన్ని లయలో
సిరివెన్నెల నిండిన యెదపై
సిరి మువ్వల సవ్వడి నీవై నర్తించగ రావేలా
నిన్ను నే కీర్తించె వేళ
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేల పుడమి హౄదయంలో
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేల పుడమి హౄదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగము ఉప్పెనగ దూకింది ఈ రాగము
చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు పుడమికి పులకల మొలకల పిలుపు
ఆషాడ మాసాన ఆ నీలి గగనాల మేఘాల రాగాల ఆలాపన
ఆషాడ మాసాన ఆ నీలి గగనాల మేఘాల రాగాల ఆలాపన
మేఘాల రాగాల ఆలాపన
చిత్రం : సిరివెన్నెల (1986)
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం