పల్లవి :
మధురమధురమీ చల్లనిరేయి
మరువ తగనిది ఈ హాయి
మధురమధురమీ చల్లనిరేయి
మరువ తగనిది ఈ హాయి
చరణం : 1
నవ్వుల వెన్నెల నాలో వలపుల...
నవ్వుల వెన్నెల నాలో వలపుల
కవ్వించునదే దేవీ
స్వాముల సోయగమెంచి
పులకించునదేమో రేరాణి
॥
చరణం : 2
విరికన్నెలు అరవిరిసిన
కన్నుల దరహసించునో దేవీ (2)
మన అనురాగము చూసి...
మన అనురాగము చూసి
చిరునవ్వుల చిలుకును స్వామీ
॥
చరణం : 3
మీ వరమున నా జీవనమే
పావనమాయెను స్వామీ (2)
ఈ వనసీమయె నీ చెలిమి... ఆ...
ఈ వనసీమయె నీ చెలిమి
జీవనమాధురి చవిచూసినదే
॥
చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన : సముద్రాల రాఘవాచార్యులు (సముద్రాల సీనియర్)
గానం : ఎ.ఎం.రాజా, భానుమతి
****************************************
Movie Name : Vipranarayana (1954)
Music Director : Saluri Rajeshwar rao
Lyricist : Samudrala Raghavacharyulu (Samudrala Senior)
Singers : A.M.Raja , Bhanumathi