పల్లవి:
చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే... ఏ... ఏ... ఏ...
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే... ఏ... ఏ... ఏ...
చరణం 1:
అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు
అల్లరి పిల్లా ఆపవేలా పుల్లవిరుపు మాటలు
పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా
పెళ్ళాం కనబడితే ప్రేమే కలిగిందా
పెళ్ళామంటే బెల్లము తల్లిదండ్రి అల్లము
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే
చరణం 2:
ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే
ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయెనే
పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా
పెద్దలు గర్జిస్తే పెడసరమవుతావా
పెద్దల గొడవ ఎందుకే ఇద్దరమొకటై ఉందామే
చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే... ఏ... ఏ... ఏ...
చరణం 3:
నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము
మీ నాయనగారి మీసమూ చూస్తేనే సన్యాసము
అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు
అబ్బా అబ్బబ్బ నీ మాటలు కొరడాదెబ్బలు
సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా
సూటిగా పెళ్ళాడి చాటుగ రానేలా
చేయకు నన్ను దూరము తీయకు మీ నా ప్రాణము
చేయకు నన్ను దూరము తీయకు మీ నా ప్రాణము
టక్కరి బావ కిక్కురు మనకు ఇక్కడి మాట
ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే... ఏ... ఏ... ఏ...
చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే... ఏ... ఏ... ఏ...
చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
రచన : ఆరుద్ర
గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల
****************************
Movie Name : Iddaru Mitrulu (1961)
Music Director : Saluri Rajeshwara Rao
Lyricist : Aarudra
Singers : P.B.Srinivas, P.Susheela