పల్లవి :
ఓహో ఓ ఓ....ఓహోహో....
ఓ ఓ....
ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఓ .. ఓ ..
చరణం : 1
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ..ఈ నల్లని రాళ్ళలో
చరణం 2:
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే....
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు ..ఈ నల్లని రాళ్ళలో..
చరణం 3:
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ..ఈ నల్లని రాళ్ళలో..
చిత్రం : అమర శిల్పి జక్కన్న (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల
**************************************************
Movie Name : Amarasilpi Jakkanna (1964)
Music Director : S.Rajeswara rao
Lyricist : Samudrala (senior)
Singer : Ghantasala