దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై

గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై

అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు

అందిని జాబిలి పొందులో అందాలు … అందిన జాబిలి పొందాలో అందాలు
పొందాను ఈనాడు ఈనాడు …. పొందాను ఈనాడు ఈనాడు
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
కనరాని దేవుని కనులా జూడాలని కలగంటి నొకనాడు ఆనాడు

కల నిజము జేసి కౌగిలిలో జేర్చి .. కల నిజము జేసి కౌగిలిలో జేర్చి
కరిగించే ఈనాడు ఈనాడు … కరిగించే ఈనాడు ఈనాడు
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
కడలిలో పుట్టావు అలలపై తేలావు నుఱగవై వచ్చావు ఎందుకో …
కడలిలో పుట్టావు అలలపై తేలావు నుఱగవై వచ్చావు ఎందుకో
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో ..
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో
ఒరిగీ కరగాలని ఆశతో ….
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
అ …. గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
చిత్రం : తేనె మనసులు (1965)
సంగీతం : K.V.మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల , పి.సుశీల