పల్లవి :
కొండగాలి తిరిగిందీ......
కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ
చరణం 1:
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికిందీ....
ఆ..ఆ
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికింది
గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది
ఆ..ఆ.
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడిందీ
ఆ..ఆ.. ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది
ఆ..ఆ..ఆ..ఆ
కొండగాలి తిరిగిందీ..
చరణం 2:
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది
నాగమల్లి పూలతో నల్లని జెడ నవ్వింది
ఆ..ఆ
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ఆ..ఆ ..ఆ..
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది
ఆ..ఆ..
కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ
చిత్రం : ఉయ్యాల - జంపాల (1965)
సంగీతం : పెండ్యాల
రచన : ఆరుద్ర
గానం: ఘంటసాల , పి.సుశీల