పల్లవి :
బిడియమేలా.. ఓ చెలి..
పిలిచె నిన్నే.. కౌగిలి..
మొదటిరేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో.. ఎందుకో
హా.. అదే ఎందుకో
బిడియమేలా... ఓ చెలి
పిలిచె నిన్నే.. కౌగిలి
మొదటి రేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో... ఎందుకో
చరణం 1:
కనులు ముకుళించెను.. లోలోన
తనువు వికసించెను.. పైపైన
కనులు ముకుళించెను.. లోలోన
తనువు వికసించెను.. పైపైన
పదము రాక.. కదలలేక
ఒదిగి ఉన్నాను ఈ వేళ
ఒదిగి ఉన్నాను ఈ వేళ
నిలువలేను... పిలువలేను
ఊ...ఊ..
బిడియమేలా... ఓ చెలి
పిలిచె నిన్నే.. కౌగిలి
మొదటి రేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో... ఎందుకో
చరణం 2:
శయ్యపై మల్లియలేమనెను
చాటుగ జాబిలి ఏమనెను
శయ్యపై మల్లియలేమనెను
చాటుగ జాబిలి ఏమనెను
కలల దారి చెలుని చేరి
కరిగిపొవేమి నీవనెను
కరిగి పొవేమి నీవనెను
మరులు పూచే... మనసు వీచే
ఊ...ఊ..
బిడియమేలా... ఓ చెలి
పిలిచె నిన్నే.. కౌగిలి
మొదటి రేయి ఒదిగిపోయి
మోము దాచేవెందుకో... ఎందుకో
చిత్రం : ఆదర్శ కుటుంబం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, సుశీల
******************************************
Movie Name : Adarsha Kutumbam (1969)
Music Director : S. Rajeswara Rao
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela