
పల్లవి :
ఏ పారిజాతమ్ములీయగలనో.. సఖీ
గిరి మల్లికలు తప్ప.. గరికపూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో.. చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా...
శరదిందు చంద్రికా...
చరణం 1:
నీవు లేని తొలి రాతిరి.. నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరి పానుపు.. నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు.. సిరులెందుకు
మనసు లేక.. మరులెందుకు
తలపెందుకు.. తనువెందుకు
నీవు లేక.. నేనెందుకు..
నీవు లేక.. నేనెందుకు..
చిత్రం : ఏకవీర (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం
*************************************************
Movie Name : Ekaveera (1969)
Music Director : K.V.Mahadevan
Lyricist : C. Narayana Reddy
Singer : S.P.Balasubramaniam