చిరునవ్వుల కులికే రాజా
సిగ్గంతా వొలికే రాణి
సరిజోడు కుదిరిందిలే సరదాలకు లోటే లేదులే(2)
కనకానికి లొంగని వాణ్ణి
కాసంటే పొంగని వాణ్ణి
ముచ్చటైన ముద్దుల గుమ్మ మోజు తీర వలచిందయ్యా
చేతిలోన చెయ్ వెయ్యమంది చెప్పినట్టు వినుకోమంది
బుద్ది కలిగి ఉండకపోతే బుగ్గపోట్లు తింటావంది..
అంతస్తులు చూడకుండా
ఐశ్వర్యం చూడకుండా(2)
చక్కనైన నడవడి చూచి చల్లని మనసిచ్చాడమ్మా
అదురు తోటి నడిచావంటే చులకనగా చూసావంటే
మడత చపాతీలు వేసి బడితె పూజ చేస్తాడమ్మా..
మా కష్టం తెలిసిన బాబు
నీ జతగాడైనాడమ్మా
చిలక గోరింకల్లాగ కిలకిలమని కులకండమ్మ
సరసాలలో గుమ్మైపోయి జలసాల్లో చిత్తయిపోయి
మమ్ము కాస్త మరిచారంటే దుమ్ము దులిపే వేస్తామయ్యో..
చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాలు, P.సుశీల
*******************************
chirunavvula kulike raajaa
siggantaa volike rani
sarijodu kudirindile saradalaku lote ledule(2)
kanakaniki longani vanni
kasante pongani vanni
muchataina muddula gumma moju teera valachindayya
chetilona chey veyyamandi cheppinattu vinukomandi
buddi kaligi vundakapote buggapotlu tintaavandi..
antastulu chudakundaa
aishwarayam chudakundaa(2)
chakkanaina nadavadi chuchi challani manasichaadammaa
aduru toti nadichavante chulakanaga chusavante
madata chapaatilu vesi badite puja chestadamma..
ma kastam telisina babu
ne jatagadainadammaa
chilaka gorinkallaga kilakilamani kulakandamma
sarasaallo gummaipoyi jalasaallo chittayipoyi
mammu kasta maricharante dummu dulipe vestamayyo..
Movie Name : Amayakuralu (1971)
Music Director : Saluri Rajeswara Rao
Lyricist : C Narayana Reddy
Singers : S.P.Balu, P.Susheela