
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట
తెలుగువారు నవ జీవననిర్మాతలని
తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట
కార్యసూరుడు వీరేశలింగం
కలం పటి పోరాడిన సింగం
దురాచాల దురాగతాలను తుదముట్టించిన అగ్ని తరంగం
ఆదిగో వీరేశలింగం
మగవాడెంతీటి ముసలాడైనా మళ్ళిపేళ్ళికి అర్హత ఉంటే
బ్రతుకే తెలియని బాల వితంతువులకెందుకు లెదా హక్కంటాను
చేతికి గాజులు తొడిగాడు చెదిరిన తిలకం దిద్దాడు
మోడు వారిన ఆ ఆ అ బ్రతుకున పసుపు కుంకుమ నిలిపాడు
నిలిపాడు….
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట
అదిగో అతడే గురజాడ
మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండే కులములు
మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండే కులములు
మంచి అన్నది మాల అయితే మాల నేనౌతాను
మాల నేనౌతాను అన్నాడు …
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట
తెలుగువారు నవ జీవననిర్మాతలని
తెలుగు జాతి సకలావనికే జ్యోతి అని
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగు బాట
చిత్రం : బలి పీఠం (1975)
సంగీతం : కె. చక్రవర్తి
రచన : శ్రీశ్రీ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల
*************************************
Kalasi paadudhaam telugu paata
Kalasi saagudhaam velugu baata
Telugu vaaru navajeevana nirmaathaalani
Telugu Jaathi sakalaavanike Jyothi ani
Kalasi paadudhaam telugu paata
Kalasi saagudhaam velugu baata
Movie Name : Bali Peetam (1975)
Music Director : Chakravarthy
Lyricist : SriSri
Singers : S.P. Bala Subramanyam, P.Susheela