• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » K.V.Mahadevan Musical Hits » పి.సుశీల పాడిన పాటలు » నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.... ముత్యాల ముగ్గు (1975)

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.... ముత్యాల ముగ్గు (1975)


నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి
విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షులారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటుందని
నావకు చెప్పండి నావకు చెప్పండి

చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : గుంటూరు శేషేంద్ర శర్మ
గానం : పి.సుశీల

ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గారు రాసిన ఏకైక చిత్ర గీతం
***********************************************

nidurinche totaloki paata okati vachindi
kannullo neeru tudichi kammati kala vachindi

nidurinche totaloki paata okati vachindi
kannullo neeru tudichi kammati kala vachindi


ramyamgaa kuteerana rangavalluladdindi
deenurali gutilona deepamga veligindi

ramyamgaa kuteerana rangavalluladdindi
deenurali gutilona deepamga veligindi

shunyamaina venuvulo oka swaram kalipi nilipindi
shunyamaina venuvulo oka swaram kalipi nilipindi
aakuraalu adaviki oka aamani daya chesindi

viphalamaina na korkelu velade gummamlo
aashala adugulu vinabadi antalo poyayi

viphalamaina na korkelu velade gummamlo
aashala adugulu vinabadi antalo poyayi

kommallo pakshullaraa gaganamlo mabbullaraa
nadi dochukupotunna navanu aapandi
revu bavurumantondani naavaku cheppandi


Movie Name : Mutyala Muggu (1975)
Music Director : K.V.Mahadevan
Lyricist : Gunturu Seshendra sharma
Singers : P.Susheela

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.... ముత్యాల ముగ్గు (1975) , Pada: 20.37

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 20.37

Related Posts

1 komentar :

  1. Saatyaki S / o Seshendra Sharma28 Juli 2025 pukul 02.52

    నాన్న శేషేంద్ర శర్మ ఒకే ఒక్క సినిమా పాట కథ
    చిత్రం - ముత్యాల ముగ్గు (1975)
    సంగీతం - కె.వి. మహదేవన్
    గీతరచన - గుంటూరు శేషేంద్ర శర్మ
    గానం - P.సుశీల
    -----------
    సాత్యకి
    S/o గుంటూరు శేషేంద్ర శర్మ
    http://seshendrasharma.weebly.com
    saatyaki@gmail.com
    1974 అక్టోబరు ప్రాంతంలో బాపు, రమణ, ముత్యాల ముగ్గు నిర్మాత సుకుమార్, ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఎంవియల్ వెళ్ళి గ్యాస్ట్బాగ్ ప్యాలస్ లో సినిమా షూటింగ్ కావాలని అడిగారు. నాన్న చేత పాటలు రాయించాలని ఇందిరా ధనా రాజర్ అడిగింది. పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని, ఒక్క పాట ఇవ్వడానికి ప్రయత్నిస్తామనీ, ముందు తీయబోయే | సినిమాల్లో ఎక్కువ పాటలు రాయిస్తామనీ వాళ్ళన్నారు. ఆ ఒక్క పాట రాయడానికి మద్రాస్ | రమ్మన్నారు. 1974 డిసంబర్ ఆఖరి వారంలో మద్రాస్ వెళ్ళాడు. రెండు రోజుల్లో తిరిగొస్తానని వెళ్ళిన మనిషి జనవరి 1975 మొదటి వారంలో తిరిగొచ్చాడు. సంగతేమిటంటే మద్రాస్ | చేరుకోగానే శ్రీలంకకు సంబంధించిన వైరల్ జ్వరం వచ్చిందట. 104, 105 డిగ్రీలు ఉండే దట. సినిమా వాళ్ళు ఎవరో డాక్టర్ని సవేరా హోటల్కు తీసుకొచ్చి ఇంజక్షన్లు పొడిపించారట. ఆ జ్వరంలోనే పాట రాశాడు. ఈ పాట అప్పుడు ఆ సినిమా కోసం రాసింది. అందులో ఒక్క | ముక్కయినా అంతకు పూర్వం లేదు.
    సంగీత దర్శకుడు కె.వి.మహదేవను హోటల్కు తీసుకువచ్చారట. పాటలో మార్పులు ఏమయినా చేయాలా అని నాన్న ఆయన్ని అడిగాడట. పాటలోనే రాగం ఉందని, దాన్ని ఉన్నది ఉన్నట్టు పాడించేయడమేననీ, రికార్డింగ్ కి ఉండనవసరంలేదని మహదేవన్ చెప్పాడట. | హైదరాబాద్ తిరిగొచ్చేశాడు. ఫిబ్రవరిలో షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తూ వస్తూ రికార్డ్ చేసిన పాటను వాళ్ళు తెచ్చి వినిపించారు. నాకు గుర్తున్నంత వరకూ గోదావరి ప్రాంతంలో ఆ పాట షూటింగ్ అప్పుడు నాన్న రాజమండ్రి ఏప్రిల్ నెలలో వెళ్ళాడు. చివరకు సినిమాలో కూడా పాట ఉంది. 1975 లోనే హైదరాబాద్ సుదర్శన్ టాకీస్ లో జరిగిన ము. ము. శతదినోత్సవాన్నికి నాన్నను పిలిచారు వేదిక మీద అక్కినేని నాగేశ్వర రావు తో ప త కం ఇప్పించారు /////// సీతాకళ్యాణంలో మూడు పాటలు రాయిస్తామన్నారు. చివరకు రెండన్నారు. తీరా మద్రాస్ చేరుకున్నాక ఒకటన్నారు. చివరికి ఆ ఒకటి కూడా తీసేశారు. 1976 జనవరి మొదటి వారం లో వాళ్ళు పిలవగా మద్రాస్ వెళ్ళాడు . మూడు పాటలన్నవాళ్ళు చివరకు ఒక పాట రాయమన్నారు . సీత బాల్య క్రీడల పాట రాయమన్నారు రాసి ఇచ్చ్చి హైదరాబాద్ తిరిగి వచ్చ్చేసాడు . 1976 ఫిబ్రవరి మొదటివారం లో నాన్న నేను మచిలీపట్నం వెళుతూ రాత్రి కావస్తుండగా బెజవాడ మనోరమా హోటల్ లో దిగాం . అనుకోకుండా ము.ము. నిర్మాత ఎంవిఎల్ అక్కడే ఉన్నాడు . నాన్నను తన గదికి వెంటతీసుకెళ్లాడు . నాన్న 11 తర్వాత మా రూమ్ తిరిగివచ్చాడు . గదిలోకి అడుగుపెడుతూనే \' పాట తీసేశారట రా " అన్న్నాడు ఇది కథ. ఆ తర్వాత ము.ము. నిర్మాత సుకుమార్, ఎంవియల్ ఏవో కాగితాల మీద ఇ.ధ సంతకాలు కావాలని అడగటానికి వెళ్ళారట. వాళ్ళ ముందు బాపు, రమణలను ఇ.ధ పచ్చి సంకృత దూషణలతో దనుమాడిందట. ఆ దనుముకు నాన్న కూడా అడపాదడపా దరువేశాడట. అప్పటినుంచీ ఇరువర్గాల మద్య వైరం ఏర్పడ్డది. బాపు, రమణల్లో ఒకరి భార్య ఆంధ్రజ్యోతి ఎడిటర్ చెల్లెలట. అప్పటినుంచీ ఆ పత్రికలో నాన్న మీద వ్యంగ్య రచనలు | రావడం మొదలయ్యింది. మిథునం సినిమా కథారచయిత శ్రీరమణ ఆంధ్ర జ్యోతి లో ఉండేవాడు. ఎప్పుడూ నాన్నా మీద దొంగ పేర్ల తో జిగుప్సకరమైన రాతలు రాసేవాడు ఈ నాటికీ బాపు, రమణ వర్గీయులు నాన్న మీద విషం ఊస్తుంటారు.
    -

    BalasHapus
    Balasan
      Balas
Tambahkan komentar
Muat yang lain...

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • Rudramadevi telugu movie songs lyrics
    Rudramadevi telugu movie songs lyrics
    Movie Name: Rudramadevi (2015) Cast: Anushka Shetty, Rana Daggubati, Baba Sehgal, Nathalia Kaur,  Prakash Raj, Krishnam Raju, Hamsa Nandini,...
  • S/o Sathyamurthy telugu movie songs lyrics
    S/o Sathyamurthy telugu movie songs lyrics
    Movie : S/o Sathyamurthy Cast  : Allu Arjun, Upendra, Rajendra Prasad, Samantha, Nithya Menen, Adah Sharma & Sneha Music : Devi Sri Pras...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ▼  Oktober (739)
      • ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు ........... మొగ...
      • ఆకలక లకలక లకలాయేనే ..... మొగుడు (2011)
      • కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి........ మొగుడ...
      • యూ ఆర్ మై హనీ... యూ ఆర్ మై జనీ... ఓ ప్రియా ప్రియా....
      • చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా..... ...
      • ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ....ఏదీ అర్ధం కాదు పైక...
      • Boys boys bachelor boys .... మొగుడు (2011)
      • సూటిగా చూడకు... సూదిలా నవ్వకు... ఇష్క్ (2...
      • ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు ............ మొగుడ...
      • అదిరే అదిరే..... నీ నల్లని కాటుక కళ్లే అదిరే .... ...
      • నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం .......... మొగుడు (2...
      • కోడి వాయే లచ్చమ్మది అయ్యో.. ఇష్క్ (2012)
      • నిరంతరమూ వసంతములే.. ప్రేమించు పెళ్లాడు (1985)
      • గోపెమ్మ చేతిలో గోరుముద్దా ...... ప్రేమించు పెళ్ల...
      • ఏవేవో కలలు కన్నాను.. మదిలో .... జ్వాల (1985)
      • సరిగమపదని సప్తస్వరాలు నీకు .... అమావాస్య చంద్రుడు...
      • కళకే కళ ఈ అందమూ ...... అమావాస్య చంద్రుడు (1981)
      • పట్టి తెచ్చానులే..పండు వెన్నెల్నీ నేనే.. ఆత్మ...
      • దాసోహం.. దాసోహం.. దాసోహం ... పెళ్ళి చూపులు (1983)
      • నిన్నే నిన్నే తలచుకుని.. నిద్దుర పొద్దులు మేలుకుని...
      • కాస్తందుకో .. దరఖాస్తందుకో .. రెండు రెళ్ళు ఆ...
      • మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ ..... పంతులమ్మ ...
      • ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా.... పంతులమ్మ (1977)
      • సిరిమల్లె నీవే... విరిజల్లు కావే... పంతులమ్మ (...
      • మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం .. పంతులమ్మ (1977)
      • నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా...... సె...
      • ముద్దుల ముద్దుల కన్నె నేనేరా ....సిరివెన్నెల వేళల ...
      • తెల్లారి పోనీకూ ఈ రేయినీ .... సిద్ధు from సికాకు...
      • ఎందుకో మదీ .. నమ్మదే ఇదీ .... నేను మీకు తెలుసా (...
      • ఏమైందో గానీ చూస్తూ చూస్తూ ......నేను మీకు తెలుసా (...
      • ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం..... ప...
      • నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ .... పెద్దరికం (1992)
      • ప్రియతమా.. ప్రియతమా ..తరగనీ పరువమా .... పెద్దరిక...
      • రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా.. ఒరేయ్.. పండు ...
      • గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ ... ఒరేయ్.. పండు (2...
      • కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం .......... జ...
      • తలదించుకు బతుకుతావా .... కెమెరామెన్ గంగతో రాంబ...
      • Mallepoovu telugu movie songs lyrics
      • ఎవరికి తెలుసు.. చితికిన మనసు .... మల్లెపువ్వు (1978)
      • మరు మల్లియ కన్నా తెల్లనిది ...... మల్లెపువ్వు (1978)
      • నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.... మల్లెపు...
      • ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా.. మల్లెపువ్వు (1...
      • చిన్న మాటా..ఒక చిన్న మాటా .... మల్లెపువ్వు (1978)
      • చక చక సాగే చక్కని బుల్లెమ్మా ...... మల్లెపువ్వు...
      • నేను నీకై పుట్టినానని .. నిన్ను పొందకా మట్టికానని ...
      • ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం ..... చంటబ్బాయి (1986)
      • మల్లెపువ్వులో .. మకరందమా .... మల్లెపువ్వు (...
      • నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ ........ మాయదారి మల్లిగా...
      • స్వరములు ఏడైనా రాగాలెన్నో ...... తూర్పు పడమర (1976)
      • కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన ..... స్వరాభిషేకం (...
      • ఒక్క క్షణం... ఒక్క క్షణం... స్వరాభిష...
      • వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం .... స్వరాభిషే...
      • సమానమెవ్వరు నీకి ల ఉమారమణ... స్వరాభిషేకం (2004)
      • నిన్న చూసిన ఉదయం కాదిది ....... చిన్నబ్బాయి (1997)
      • ఏమని నే .. చెలి పాడుదునో ... మంత్రిగారి వియ్యంకుడ...
      • ఇది తియ్యని వెన్నెల రేయి ....... ప్రేమలేఖల...
      • కరిగిపోయాను కర్పూర వీణలా .......... మరణ మృదంగం (...
      • నీకూ నాకూ పెళ్ళంట..నింగికి నేలకు కుళ్ళంట ...... జ్...
      • ఏడు కొండలపైన ఏలవెలిసావో..ఎవరికీ అందక ఎందుకున్నావో....
      • సిరిమల్లె పూవల్లె నవ్వు.... చిన్నారి పాపల్లె నవ్వు...
      • తెలుగు జాతి మనది ..నిండుగ వెలుగు జాతి మనది ... తల్...
      • కలిసి వుంటే కలదు సుఖం ........ కలిసి వుంటే కలదు స...
      • వేణుగానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య .... సిరి...
      • స్వరాల వరాల తరాల స్వనాల మధురిమలోన ..... తేజం (2009)
      • గ్రహణం పట్టని చంద్రబింబమా..పడిశం పట్టని వదనమా ... ...
      • చందమామ లాంటి మోము.. రాధాగోపాలం (2005)
      • అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు ..... రాధాగోపాలం (2005)
      • బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా ....... లారీ డ్ర...
      • దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే ........ ...
      • రామ్మా ఓ రామ్మా ఓ భామా హంగామా హో.... దేవీ పుత్రుడ...
      • ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా ... దే...
      • ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా .. ప్రాణమా... దేవీపు...
      • తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ .... దేవ...
      • Marana Mrudangam telugu movie songs lyrics
      • సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగా ...... చిల...
      • తల్లి గోదారికే ఆటు పోటుంటే ........ చిల్లర కొట్టు...
      • ఎందుకనీ ఏమిటనీ ..బిగి బిగి జరసాల .... 143 (I Miss ...
      • కలలోన నువ్వే ఇలలోన నువ్వే ........ 143 (I Miss Yo...
      • ఓరోరి దేవుడా మొగుడే రాడా ..ఈ పెళ్ళియోగం నాకింకలేదా...
      • నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ .... 143 ...
      • రా రాగమై రమ్మన్నా .. రా తాళమై నేనున్నా ...143 (I M...
      • కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ..........
      • ప్రకృతి కాంతకు యెన్నెన్ని హొయలో...... సిరివెన్నెల ...
      • విధాత తలపున ప్రభవించినది .......... సిరివెన్నెల (...
      • చందమామ రావే జాబిల్లి రావే ..... సిరివెన్నె...
      • ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడ...
      • నిన్ను చూడనీ నన్ను పాడనీ ......... మనుషులు మమతలు ...
      • శ్రీ గౌరి శ్రీగౌరీవే! శివుని శిరమందు ......... ...
      • కన్నయ్యా, నల్లని కన్నయ్యా ... నిన్ను కనలేని కనులుం...
      • రఘుకుల తిలకా నీ ఆనతి రచియించితి ...... కథానాయిక మ...
      • ఇదిగో రాయలసీమ గడ్డ ... దీని కథ తెలుసుకో తెలుగుబిడ్...
      • ఎగిరే పావురమా దిగులెరగని పావురమా ...... జగత్ కిలాడ...
      • కొనుమిదే కుసుమాంజలి .... శ్రీకృష్ణ తులాభారం (1...
      • హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ......... అష్టా...
      • ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా ...... అష్టా చెమ్మ...
      • చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ...... ...
      • మనసున వున్నదీ చెప్పాలనున్నదీ ....... ప్రియమైన నీక...
      • పూత వేసిన లేత మావిని చూసినట్టుంది .... సంగమం (2007)
      • మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ .... మూగమన...
      • నా పాట నీ నోట పలకాల సిలకా.. నీ బుగ్గలో సిగ్గు లొలక...
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved