పల్లవి:
మూ..మూ...మూ....ఊఊ..ఊఊ
ఎదురీతకు అంతంలేదా..
నా మదిలో రేగే గాయం మానిపోదా..
ఎదురీతకు అంతంలేదా..
నా మదిలో రేగే గాయం మానిపోదా..
వాడిన వసంతం..ఎనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా..
చరణం 1:
సాగరమే నా చేరువ నున్నా..దాహం తీరదులే
తీరాలేవో..చేరుతు వున్నా దూరం ..మారదులే.. హ హ
ఇది నడియేట తీరాల వేట..
ఇంకెన్నాళ్ళు ఈ వేట
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా..
చరణం 2:
చేయని నేరం చెలిమిని కూడ..మాయం చేసేనా..
మాసిన మదిలో మమతలు కూడ..గాయం చేసేనా..ఆ
నాయనువారే పగవారైతే... హ
ఇంకెన్నాళ్ళూ ఈ ఎదురీత
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా..
వాడిన వసంతం..ఎనాడైనా వికసించి రాదా
ఎదురీతకు అంతంలేదా..నా మదిలో రేగే గాయం మానిపోదా..
చిత్రం : ఎదురీత (1977)
సంగీతం : సత్యం
రచన : శ్రీశ్రీ
గానం: S.P.బాలు. పి.సుశీల