సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా
తెల్లరబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళర చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా సందమావ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో
సిరిమల్లె పువ్వా
కొండల్లొ కోనల్లో కోయన్న వాకాయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న వో తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లార దిక్కులు దాటి వాడెన్నళ్ళకొస్తాడో
సిరిమల్లె పువ్వా
చిత్రం : పదహారేళ్ళ వయస్సు (1978)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.జానకి