పల్లవి:
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి
యెంత కష్టం.... యెంత కష్టం
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని...
తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి
యెంత కష్టం.... యెంత కష్టం
చరణం 1:
మూడు రోజులు ఒక్క తీరుగ నడుస్తున్నా దిక్కు తెలియక
నడిసముద్రపు నావ రీతిగా సంచరిస్తూ సంచలిస్తూ
దిగులు బడుతూ దీనుడౌతూ తిరుగుతుంటే...
చండ చండం తీవ్ర తీవ్రం....
జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే....
మబ్బు పట్టి గాలి కొట్టి...
వాన వస్తే... వరద వస్తే...
చిమ్మ చీకటి కమ్ముకొస్తే...
దారి తప్పిన బాటసారికి
ఎంత కష్టం.... యెంత కష్టం!
కళ్ళు వాకిట నిలిపి చూసే...పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో!
కళ్ళు వాకిట నిలిపి చూసే...పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి
యెంత కష్టం.... యెంత కష్టం
చిత్రం : ఆకలి రాజ్యం (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
రచన : శ్రీశ్రీ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం