పల్లవి:
వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేనువులూదాడే
మది వెన్నలు దోచాడే
అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే
మా ముద్దు గోవిందుడే
చరణం:
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె ఏ ఏ
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె
కన్న తోడూ లేని వాడే కన్నె తోడూ ఉన్నవాడే
మోహనాల వేణువూదే మొహనాంగుడితడేలే
మోహనాల వేణువూదే మొహనాంగుడితడేలే
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
చరణం:
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయభారమేగినాడే
గీతార్ధ సారమిచ్చి గీతాలెన్నో మార్చేనే
గీతార్ధ సారమిచ్చి గీతాలెన్నో మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేనువులూదాడే మది వెన్నలు దోచాడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేనువులూదాడే మది వెన్నలు దోచాడే
అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
చిత్రం : సాగరసంగమం (1983)
రచన : వేటూరి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.పి.శైలజ