పల్లవి:
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మ వరమో
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మ వరమో
కలగానో... కథగానో....
మిగిలేది నీవే ఈ జన్మలో...
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మ వరమో
చరణం:
నాలోని నీవే నేనైనాను - నీలోని నేనే నీవైనావు
నాలోని నీవే నేనైనాను - నీలోని నేనే నీవైనావు
విన్నావ ఈ వింతను - అన్నారా ఎవరైనను
విన్నావ ఈ వింతను - అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మ వరమో
చరణం:
ఆకాశమల్లె నీవున్నావు - నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు - నీ నీలి రంగై నేనున్నాను
కలిసేది ఊహేనను - ఊహల్లో కలిసామను
కలిసేది ఊహేనను - ఊహల్లో కలిసామను
నేను నేనే సాక్షాలను
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మ వరమో
కలగానో... కథగానో....
మిగిలేది నీవే ఈ జన్మలో...
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మ వరమో
ఏ నావదే తీరమో ఏ నేస్తమే జన్మ వరమో
చిత్రం: సంకీర్తన (1987)
రచన:
సంగీతం: ఇళయరాజా
గానం: K.J.యేసుదాస్