కవితా... ఆ...
ఓ... కవితా...
కవితా ఓ కవితా...
నా కవితా...
ప్రియ కవితా...
కళ్లలో కదిలే కవిత
కలల్లో కలిసే కవిత
నీవులేని జీవనం
నీరు లేని సాగరం
॥
॥చరణం : 1
గాలిలో నీ కాలిసవ్వడి వింటే చాలు గాలిలో నీ కాలిసవ్వడి వింటే చాలు
ఊహల విరిజల్లు మది ఊకే పరవళ్లు
తోటలో నీ పైట నీడన ఉంటే చాలు
స్వాగత నీరాలు రసరంజిత తీరాలు
ఎలా నిన్ను మరవను
ఎలా క్షణం గడపను
నీ పాద చుంబనం
నా పూజా సాధనం (2)॥
చరణం : 2
ఎంతగా దూరాన ఉన్నా
ఎద టున్నావు
నడిచే పున్నమివై
నగవొలికే కిన్నెరివై
ఎన్నడూ మనకున్న
బంధం విడిపోలేదు
ఎవ్వరు ఏమన్నా
ఏ పువ్వులు ముళ్లైనా
॥మనది దివ్య సంగమం మనకు దాని మందిరం
॥॥
సాసస గాగగ
మామమ పాపప (2)
కవినీ కవితను వేరువేరుగా చూసేదెవరూ
నింగి నుండి నీలిమను
విడదీసేదెవరూ
నా అక్షర కోశం విడిచే
ప్రతి నిశ్వాసం నీదే
నా ఆశయ లయలో
కదిలే ప్రతి విశ్వాసం మనదే
ఆ... ఆ... కవితా... ఓ... కవితా...
చిత్రం : భామా కలాపం (1988)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరి వాసూరావు
గానం : ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ