సరేలే ఊరుకో పరేషానెందుకు
సరేలే ఊరుకో పరేషానెందుకు
చలేసే ఊరిలో జనాలే ఉండరా
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్తా మారిపొతే
మూతిముడుచుకునుంటారా
ఆటలోనూ పాటలోనూ మూడు మళ్ళీ మార్చుకోరా
మేరా నాం జోకరూ మేరా కాం నౌకరూ
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరూ
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరూ
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా
పిల్లిపిల్లదెపుడూ ఒకే మాటకదా
మియవ్ మియావ్ మియావ్ మియావ్ మియావ్ మియావ్
కోడి పెట్టదెపుడూ ఒకే కూతకదా
కొకో కొకొరొకో కొకో కొకొరొకో
కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలుక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వునెప్పుడు మారనీయకే యేమైనా
కష్టమొస్తే కేరుచేయక నవ్వుతో తరివేయవమ్మ
మేరా నాం జోకరూ మేరా కాం నౌకరూ
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరూ
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరూ
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా
గూటిబిళ్ళ ఆడదాం సిక్సరుకొడదాం
క్రికెట్ కాదుగాని ఫన్నీగానే ఉంది
ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం
బఫెల్లోసుకది బాత్రూంకాదా మరి
రాణిగారిపోజులో నువు కూరుసోట్టీగా
గేదెగారి వీపుమీద షైరు కెళదాం స్టైలుగా
జురాసిక్ పార్కుకన్నా బెస్టుప్లేసీ పల్లెటూరే బుల్లెమ్మా
బోలెడన్ని వింతలున్నాయ్ బోరులేక చూడవమ్మా
మేరా నాం జోకరూ మేరా కాం నౌకరూ
ఇదో నా చేతిలో అలాడీన్ లాంతరూ
ఎనీ థింగ్ కోరుకో క్షణంలో హాజరూ
ఖరీదేం లేదుగానీ ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా
చిత్రం : లిటిల్ సోల్జర్స్ (1996)
సంగీతం : శ్రీ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్రీ