ఓఒ ఓఒ ఓ.. వెండి వెన్నెలా
ఓఒ ఓఒ ఓ.. దిగిరా ఇలా
అమ్మ కొంగులో చంటిపాపలా
మబ్బు చాటునే ఉంటే ఎలా
పడిపోతారని పసి పాదాలకే పరుగే నేర్పవా?
మదిలో దాగిన మధు భావాలకీ వెలుగే చూపవా?
మనసుంటే మార్గముంది తెంచుకోవె సంకెలా !
ఓఒ ఓఒ ఓ..సుప్రభాతమా
ఓఒ ఓఒ ఓ..శుభమంత్రమా
మేలుకొమ్మనే ప్రేమగీతమా
చేరుకున్న నా తొలి చైత్రమా
ఈ స్వరాలతో నా నరాలలో ఒక గంగా నది
ఈ క్షణాన నీ జత చేరాలనీ అలలౌతున్నదీ
వెల్లువలా చేరుకోవే వేచి ఉన్న సంద్రమా
అంత దూరమా స్వర్గమన్నదీ
చిటికెలో ఇలా మనదైనదీ
అందరానిదా స్వప్నమైనదీ
అందమైన ఈ నిజమైనదీ
చిరు హాసానికే మా సంసారమే చిరునామా అనీ
ఈ సంతొషమే మా సంతానమై చిగురించాలనీ
ప్రతిరోజు పండగల్లె సాగుతోంది జీవితం !!
చిత్రం : లిటిల్ సోల్జర్స్ (1996)
సంగీతం : శ్రీ
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : రామ్ చక్రవర్తి , శ్రీలేఖ