పల్లవి :
[అతడు] దువ్విన తలనే దువ్వటం అత్తిన పౌడర్ అద్దడం ||2||
అద్దం వదలక పోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం ఉండి ఉండి అరవడం తెగ అరచి చుట్టూ చూడడం
ఇన్ని మార్పులకు కారణం ఎమై ఉంటుందోయి
[కోరస్] ఇది కాదా love (లవ్) ఇదికాదా love (లవ్)…
చరణం 1
[అతడు] ముఖమున మొటిమే రావడం మనస్సుకు చెమటే పట్టడం
మతి మరుపెంతో కలగడం మతి స్థిమితం పూర్తిగా తప్పడం త్వరగా
స్నానం చెయ్యడం త్వరత్వరగా భోం చేస్తుండడం త్వరగా కలలో కెళ్ళడం
ఆలస్యానికి రువ్వడం ఇన్ని అర్థాలకు ఒకే పదం ఏమై ఉంటుందోయి
ఇదికాదా love (లవ్) ఇదికాదా love (లవ్)…
చిత్రం : నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం : M.M.కీరవాణి
రచన : చంద్రబోస్
గానం : M.M.కీరవాణి, సుమంగళి