
కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా
కోటలోనా పాగావేసావా చల్ పూవులరంగా
మాటతోనే మనసు దోచావా
చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా
కోరికలతో కోటే కట్టావా చల్ నవ్వుల రాణి
దోరవలపుల దోచుకున్నావా
చెట్టుమీద పిట్ట ఉంది పిట్ట నోట పిలుపు ఉంది
పిలుపు ఎవరికో తెలుసుకున్నావా
చల్ పూవుల రంగా తెలుసుకుంటే కలిసి ఉంటావా
పిలుపు విన్నా తెలుసుకున్నా
పిల్లదానా నమ్ముకున్నా
తెప్పలాగా తేలుతున్నానే
చల్ నవ్వుల రాణి .. నాకు జోడుగా నావ నడిపేవా
చల్ నవ్వుల రాణి .. నాకు జోడుగా నావ నడిపేవా
కోడెకారూ....
నేలవదిలి నీరు వదిలి నేను నువ్వను తలపు మాని
ఇద్దరొకటై ఎగిరిపోదామా
చల్ పూవులరంగా గాలి దారుల తేలి పోదామా
ఆడదాని మాటవింటే తేలిపోవటం తేలికంటే
తెల్సి తెల్సి ముంచుతారంట
చల్ నవ్వులరాణీ మునుగుతుంటే నవ్వుతారంట..
చల్ నవ్వులరాణీ మునుగుతుంటే నవ్వుతారంట..
కోడెకారూ...
చిత్రం : ముందడుగు (1958)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : మాధవపెద్ది సత్యం,ఎస్.జానకి
********************************************
Movie Name : Mundadugu (1958)
Music Director : K.V.Mahadevan
Lyricist : Aatreya
Singers : Madavapeddi Satyam, S.Janaki