మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…
మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…
నేనైతె ఆకుకొమ్మ… తానైతె వెన్నెలవెల్ల
నేనైతె ఆకుకొమ్మ… తానైతె వెన్నెలవెల్ల
పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది
మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…
కొవెల్లో వెలిగే దీపం దేవీ మాతల్లి
కొవెల్లో తిరిగే పాటల గువ్వా నాచెల్లి
కొవెల్లో వెలిగే దీపం దేవీ మాతల్లి
కొవెల్లో తిరిగే పాటల గువ్వా నాచెల్లి
గువ్వంటే గువ్వాకాదు… గొరవంక గానీ..
వంకంటే వంకాగాదు… నెలవంక గానీ
మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…
గోరింకా పెళ్లయిపోతే .. ఏవంకో వెళ్లిపోతే
గోరింకా పెళ్లయిపోతే .. ఏవంకో వెళ్లిపోతే
గూడంతా గుభులయిపోదా… గుండెల్లో దిగులైపోదా..
మేడంటే మేడా కాదు… గూడంటే గూడూ కాదు..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది… పొదరిల్లు మాది…
చిత్రం : సుఖ దు:ఖాలు (1967)
సంగీతం : S.P.కోదండపాణి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
******************************
Movie Name : Sukhadhukhaalu (1967)
Music Director : S.P.Kodandapani
Lyricist : Devulapalli KrishnaSastry
Singer : S.P.Bala subramanyam