పల్లవి:
చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ...
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు...
చిట్టి అమ్మలూ....
చరణం 1:
ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
నీకు నేను అమ్మనూ నాన్ననూ...
నీకు నేను అమ్మనూ నాన్ననూ ..
నాకు నీవే లోకాన సర్వమూ...
నాకు నీవే లోకాన సర్వమూ ...
చరణం 2:
హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు ..
తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు
చరణం 3:
అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం
ఎదను చీల్చి పాడుతున్న జోలలు
ఎదను చీల్చి పాడుతున్న జోలలు ..
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు ...
చిత్రం : ఆస్తిపరులు (1966)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల