పల్లవి:
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా రా
చరణం 1:
దోరవయసు అలవి కాని భారమయింది
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది
దోరవయసు అలవి కాని భారమయింది
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది
నడుములేని నడకే ఒక నాట్యమయింది
నడుములేని నడకే ఒక నాట్యమయింది
చూచి చూచి బావ మనసు సొమ్మసిల్లింది.. సొమ్మసిల్లింది
చరణం 2:
అత్తకూతురంటేనే హక్కు ఉందిలే
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే
అత్తకూతురంటేనే హక్కు ఉందిలే
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే
ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో
ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో
ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే .. కొత్త పెళ్ళి కూతురే
చిత్రం : ఆస్తిపరులు (1966)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల