పల్లవి:
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
చరణం 1:
కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటే కాలుజారి పడ్డాడే సోగ్గాడు

పగటివేషగాడల్లే పల్లెటూళ్ళు తిరుగుతుంటే కుక్కపిల్ల భౌ అంది.. ఆయ్..
పడుసు పిల్ల ఫక్కుమంది.. హహహ..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
చరణం 2:
కళ్ళజోడు ఏసికోని గళ్ళకోటు తొడుక్కోని పిల్లగాలికొచ్చాడే సొగ్గాడు

చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేనూ..
చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేనూ.. బిక్కమొగమేసాడు సుక్కలొంక చూసాడూ..
బిక్కమొగమేసాడు సుక్కలొంక చూసాడూ..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
చరణం 3:
మూతి మీసం గొరుక్కోని.. బోసి మొహం పెట్టుకోని యాట కోసం వచ్చాడే సోగ్గాడు

బుల్లిదొర వచ్చెనని కుక్కపిల్ల ఎక్కిరిస్తే ఎర్రిమొహం ఏసాడు.. హోయ్..
మిర్రిమిర్రి చూసాడు.. హూ..హోయ్..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..
సోగ్గాడే చిన్నినాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ.. సోగ్గాడు..
చిత్రం : ఆస్తిపరులు (1966)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : P.సుశీల