
పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగా కింకేది కానరాని మన్మధుడేమో
కనుపించెను ఏడీ ఏడీ ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ
వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ ఏవీ ఏవీ
అవి నీ సిగలోనే ఉన్నాయి, పదును పదును బాణాలేవో
ఎదను నాటుకుంటున్నాయీ ఏవీ ఎవీ అవి నీ ఓరచూపులేనోయీ
//పగటి//
ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఏమో ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో
//పగటి//
చిత్రం : చిక్కడు దొరకడు (1967)
సంగీతం: టి.వి.రాజు
రచన : సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, పి.సుశీల
*************************************************
Movie Name : Chikkadu Dorakadu (1967)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela