ఒకసారి కలలోకి రావయ్యా...
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే
నీ హృదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే
ఒకసారి రాగానే ఏమౌనులే
ఓ గొల్ల గోపయ్యా
పగడాల నా మోవి చిగురించెరా
మోము చెమరించెరా మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా (2)
చెమ్మోవి పై తేనె ఒలికించనా (2)
తనివి కలిగించనా మనసు కరిగించనా
కేరింత లాడించి శోలించనా (2)
ఒకసారి కలలోకి రావయ్యా...ఆ ..ఆ ..
వొంపు సొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే (2)
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా (2)
మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా
పదును తేరిన వలపు పండించరా (2)
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా...
ఒకసారి రాగానే ఏమౌనులే
చిత్రం : గోపాలుడు-భూపాలుడు (1967)
సంగీతం : S.P.కోదండపాణి
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం : ఘంటసాల , S.జానకి
*************************************************
Movie Name : Gopaludu Bhupaludu (1967)
Music Director : S.P.Kodandapani
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, S.Janaki