పల్లవి:
ఓ..ఓ..ఓ..
ముద్దులొలికే ముద్దబంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ఇస్తావా... అందిస్తావా
అందిస్తావా...నీ నవ్వులు
అవి ఎన్నడు వాడని పువ్వులు
చరణం 1:
కళ్ళలోన నీ రూపే...కళ కళలాడుతు ఉంటే
కళ్ళలోన నీ రూపే...కళ కళలాడుతు ఉంటే
కలలోన నీ చూపే... గిలిగింతలు పెడుతుంటే
కలలోన నీ చూపే... గిలిగింతలు పెడుతుంటే
నా మనసే నీదైతే...నా బ్రతుకే నీదైతే
ఇవ్వాలని అడగాలా...ఇంకా నాతో సరసాలా...
ఇంకా నాతో సరసాలా...
ఓ..ఓ...ఓ..
వలపులోలికే అత్త కొడుకా...చిలకకు తగ్గ గోరింక
ఈ చిలకకు తగ్గా గోరింక...వస్తావా కవ్విస్తావా
నువ్వు వస్తావా ...నా బాటలో...
వసి వాడని పరువపు తోటలో...
చరణం 2:
గూటిలోన దాగుంటే...గుసగుస పెడుతున్నాను
గూటిలోన దాగుంటే...గుసగుస పెడుతున్నాను
తోటలోనా నీవుంటే...తోడుగ నేనుంటాను
తోటలోనా నీవుంటే...తోడుగ నేనుంటాను
నాలోనే నీవుంటే...నీలోనే నేనుంటే
ఇంకేమి కావాలి...ఇలపై స్వర్గం రావాలి
ఇలపై స్వర్గం రావాలి...
ఓ..ఓ..ఓ...
ముద్దులోలికే ముద్దబంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ముసి ముసినవ్వుల చేమంతి
ఓ..ఓ..ఓ..
వలపులోలికే అత్తకొడుకా...చిలకకు తగ్గ గోరింక
ఈ చిలకకు తగ్గా గోరింక
చిత్రం : కదలడు వదలడు (1969)
సంగీతం : టి.వి. రాజు
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: ఘంటసాల, సుశీల
*************************************************
Movie Name : Kadaladu Vadaladu (1969)
Music Director : T.V.Raju
Lyricist : C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela