
పల్లవి :
కృష్ణా.... నీ పేరు తలచినా చాలు
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
చరణం : 1
ఏమి మురళి అది ఏమీ రవళి రా..అ.ఆ..
ఏమి మురళి అది ఏమీ రవళి రా
పాట వినగ ప్రాణాలు కదలురా
ఏమీ మురళి అది ఏమీ రవళి రా
పాట వినగ ప్రాణాలు కదలురా
మురళీధరా నీ స్వరలహరులలో
మరణమైనా మధురమురా
చరణం : 2
వెదురు పొదలలో తిరిగీ తిరిగీ
నీ పదపల్లవములు కందిపోయేనో
వెదురు పొదలలో తిరిగీ తిరిగీ
నీ పదపల్లవములు కందిపోయేనో
యెదపానుపుపై పవలించరా
నా పొదిగిన కౌగిట పులకించరా
చరణం : 3
గోపాలా ...నందబాలా.....
నవమంజుల మురళీలోల
మృదు సమీరకంపిత
మనోజ్ఞకుంతల తమాలపల్లవజాలా
కృష్ణా నీ పేరు తలచినా చాలూ
ఏమీ పిలుపు అది ఏమి పిలుపు
బృందానికుంజముల పూలు పూసి
శరదిందు చంద్రికల కేయిసాకి
కరుణాంతరంగముల దాగి దాగి
చెలి అందెలందు చెలరేగి రేగి
నను తొందరించెరా ..ఆ...తొలకరించెరా..ఆ..
తొందరించెరా తొలకరించెరా
వలపు జల్లుగా పలుకరించెరా
వల్లవీరమణి చల్లని ఉల్లము
అల్లన జల్లన పరవశించెరా..ఆ..ఆ..
కృష్ణా....
నీ పేరు తలచినా చాలు
చిత్రం : ఏకవీర (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం : P.సుశీల
*************************************************
Movie Name : Ekaveera (1969)
Music Director : K.V.Mahadevan
Lyricist : C. Narayana Reddy
Singer : P.Susheela