పల్లవి :
సర్..సర్..సార్..
ఎప్పుడూ మీ పాఠాలంటె.. ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను.. హియర్ మీ డియర్ సార్
చరణం 1 :
ఒకటీ ఒకటీ కలిపితే రెండు..అది గణితం
మనసూ మనసూ కూడితే..ఒకటే... ఇది జీవితం
గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంధాలు..
గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంధాలు..
పురివిప్పుకొని ఎగరాలంటాయి అందాలు...
ఎప్పుడూ మీ పాఠాలంటె.. ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను.. హియర్ మీ డియర్ సార్
చరణం 2:
కళ్ళల్లో చూడండీ.. కనిపించును నీలాలు
పెదవుల్లో చూడండీ.. అగుపించును పగడాలు
దోసిలినిండా దొరుకుతాయి.. దోరనవ్వుల ముత్యాలు
కన్నెమేనిలో.. ఉన్నాయి..
కన్నెమేనిలో.. ఉన్నాయి
ఏ గనిలో దొరకని రతనాలు..మ్మ్..
ఎప్పుడూ మీ పాఠాలంటె..ఎలాగండి సార్
ఈరోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్
చరణం 3:
రాధా మాధవ రాగజీవనం.. ఒక బంధం
కలువా జాబిలి వింతకలయికే.. అనుబంధం
యుగయుగాలకూ మిగిలేదొకటే.. అనురాగం
యుగయుగాలకూ మిగిలేదొకటే.. అనురాగం
చెలి మనసెరిగిన చినవానిదేలే.. ఆనందం
ఎప్పుడూ మీ పాఠాలంటె..ఎలాగండి సార్
ఈ రోజు నే చెపుతాను..హియర్ మీ డియర్ సార్
చిత్రం : అమ్మ మాట (1972)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : పి . సుశీల
************************************
Movie Name : Amma Mata (1972)
Music Director : Ramesh Naidu
Lyricist : C. Narayana Reddy
Singer : P.Susheela