పల్లవి :
హవ్వా...
ఎవరైనా చూశారా... ఏమనుకుంటారు..ఊ..ఊ..
ఎవరైనా చూశారా... ఏమనుకుంటారు..ఊ..ఊ..
కొత్త మురిపెం పొద్దెరగదని... చెప్పుకోంటారు ..ఆపై తప్పుకుంటారు
ఎవరైనా చూశారా .... ఏమనుకుంటారు
చరణం 1:
ఇటు పువ్వు చూస్తుంది... అటు గువ్వ చూస్తుంది..ఉహు..
గుబురు గుబురుగా.... గుండె గుబులుగా..ఊహూ..
ఇటు పువ్వు చూస్తుంది... అటు గువ్వ చూస్తుంది..
గుబురు గుబురుగా.... గుండె గుబులుగా..
గురివింద పొద చూస్తుంది... గురివింద పొద చూస్తుందీ
పువ్వులాగ నవ్వుకోని... గువ్వలాగ రివ్వుమని
పువ్వులాగ నవ్వుకోని... గువ్వలాగ రివ్వుమని
ఇరువురిని ఆ పొదరిల్లు... పరవశించి పోమ్మందీ
అమ్మమ్మ...ఎవరైనా చూశారా...ఏమనుకుంటారు
చరణం 2
అటు పొద్దు వాలుతుంది... మన ముద్దు తీరకుంది..ఉహు..
అటు పొద్దు వాలుతుంది... మన ముద్దు తీరకుంది..
కోయని పిలిచే కోరిక లెరిగి... నన్నందుకోని పోరాదా..ఊహూ...
..నన్నందుకోని పోరాదా
నీ నడుమున చేయివేసి... నిలువెల్లా పెనవేసి
నీ నడుమున చేయివేసి... నిలువెల్లా పెనవేసి
నీలాల మబ్బుల్లోకి ... నిన్నెత్తుకు పోతానే..హోయ్యా
ఎవరైనా చూశారా...ఏమనుకుంటారు
కొత్త మురిపెం పొద్దెరుగదని...చెప్పుకుంటారు ...ఆపై తప్పుకుంటారు
చిత్రం : అమ్మ మాట (1972)
సంగీతం : రమేశ్ నాయుడు
రచన : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం , P.సుశీల
*******************************************
Movie Name : Amma Maata (1972)
Music Director : Ramesh Naidu
Lyricist : Devulapalli Krishna sastry
Singers : S.P.Balasubramanyam, P.Susheela