పల్లవి : సీతాలు సింగారం మాలచ్చి బంగారంసీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం॥మనసున్న మందారం మనిషంతా బంగారంబంగారు కొండయ్యంటే భగవంతుడవతారం॥॥చరణం : 1 పూసంత నవ్విందంటే పున్నమి కావాలాఅయితే నవ్వనులే...కాసంత చూసిందంటే కడలే పొంగాలాఇక చూడలేను...పూసంత నవ్విందంటే పున్నమి కావాలాకాసంత చూసిందంటే కడలే పొంగాలాఎండి తెరమీద పుత్తడిబొమ్మ ఎలగాలా ఎదగాలాఆ ఎదుగూ ఒదుగూ యెలుగూ కన్నుల యెన్నెల కాయాలానువ్వంటుంటే నే వింటుంటే నూరేళ్లు నిండాలా ॥చరణం : 2దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రానుఅయితే నేనే వస్తాలే...చక్కలిగింతలు పెట్టావంటే చుక్కయిపోతానుఎగిరొస్తాలే...దాగుడుమూతలు ఆడావంటే దగ్గరకే రానుచక్కలిగింతలు పెట్టావంటే చుక్కయిపోతానుగుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి వెలిగించాలానీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై ఉండిపోవాలానువ్వంటుంటే నే వింటుంటే వెయ్యేళ్లు బతకాలా॥చిత్రం : సీతామాలక్ష్మి (1978)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల