పల్లవి:
ఓదార్పుకన్న చల్లనిది.. నిట్టూర్పుకన్న వెచ్చనిది
గగనాలకన్న మౌనమిది.. అర్చనగా..ద ద ద ని
అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ
ఓదార్పుకన్న చల్లనిది.. నిట్టూర్పుకన్న వెచ్చనిది
గగనాలకన్న మౌనమిది.. అర్చనగా..ద ద ద ని
అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ
చరణం 1:
వేదాలకైన మూలమది.. నాదాలలోన భావమది
దైవాలకైన ఊయలది.. కాలాలకన్న వేదమది
కన్నీళ్ళు మింగి బ్రతికేది.. అదిలేనినాడు బ్రతుకేది
నీకై జీవించి..
నిన్నే దీవించి..
నీకై మరణించు..
జన్మజన్మల ఋణమీ ప్రేమ
ఓదార్పుకన్న చల్లనిది.. నిట్టూర్పుకన్న వెచ్చనిది
గగనాలకన్న మౌనమిది.. అర్చనగా..ద ద ద ని
అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ
చరణం 2:
లయమైన సృష్టి కల్పములో.. చివురించు లేత పల్లవిది
గతమైనగాని రేపటిది.. అమ్మలనుగన్న అమ్మ ఇది
పూలెన్ని రాలిపోతున్నా.. పులకించు ఆత్మగంధమిది
నిన్నే ఆశించి..
నిన్నే సేవించి..
కలలే అర్పించు..
బ్రతుకు చాలని బంధం ప్రేమ
ఓదార్పుకన్న చల్లనిది.. నిట్టూర్పుకన్న వెచ్చనిది
గగనాలకన్న మౌనమిది.. అర్చనగా..ద ద ద ని
అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ
చిత్రం : అమరజీవి (1983)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : S.P.బాలు, S.జానకి