
హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా
నీ తలపులనే పల్లవి గా ...
దేవత నీవని తలచీ కవితను నేను రచించా
అనురాగాలే మలిచీ ధ్యానం చేసి పిలిచా
నీ చెవికది చేరకపోతే నీ చెవికది చేరక పోతే
జీవితమే మాయని చింతే జీవితమే మాయని చింతే !
నా ప్రేమకు మీరే సాక్షం నీ కోపము నిప్పుల సాక్షం
నీటికి నిప్పులు ఆరూ నీ కోపం ఎప్పుడు తీరు ?
నీ ప్రేమే కరువైపోతే నీ ప్రేమే కరువైపోతే
నే లోకము విడిచిపోతా లోకము విడిచిపోతా!...
చిత్రం : ప్రేమ సాగరం (1983)
సంగీతం : టి.రాజేందర్
రచన : రాజశ్రీ
గానం : ఎం.రమేష్
*********************************
Movie Name : Prema Sagaram (1983)
Music Director : T.Rajender
Lyricist : Rajasri
Singer : M.Ramesh