చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషాదూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలీ చిరుగాలీ చెలి చెంతకు వెళ్ళి
అందించాలి నా ప్రేమ సందేశం "2"
మూసారు గుడిలోన తలుపులను
ఆపారు గుండెల్లొ పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను
వీలు కాదు చెప్పాలంటే వేదనను
కలతైపొయే నా హృదయం
కరువైపొయే ఆనందం
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అయిపోయే చెరసాల
గాలీ చిరుగాలీ చెలి చెంతకు వెళ్ళి
అందించాలి నా ప్రేమ సందేశం
నా ప్రేమ రాగాలు కలలాయే
కన్నీటీ కథలన్నీ బరువాయే
మబ్బు వెనుక చందమామ దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్నీ దాచుకున్నదొ
వేదనలేల ఈ సమయం....
వెలుతురు నీదే రేపుదయం
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోకములు తీరేను
గాలీ చిరుగాలీ చెలి చెంతకు వెళ్ళి
అందించాలి నా ప్రేమ సందేశం
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషాదూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలీ చిరుగాలీ చెలి చెంతకు వెళ్ళి
అందించాలి నా ప్రేమ సందేశం
ఈ నా ప్రేమ సందేశం
ఈ నా ప్రేమ సందేశం
చిత్రం : ప్రేమ సాగరం (1983)
సంగీతం : టి.రాజేందర్
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం