గోరింట పూసింది గోరింక కూసింది
గొడవేమిటే రామ చిలకా గొడవేమిటే రామ చిలకా
నే తీర్చనా తీపి అలకా ఆ నే తీర్చనా తీపి అలకా
గోరింక వలచింది గోరింక పండింది
కోరిందిలే రామ చిలక ..2
నీనుద్దు నా ముక్కు పుడక
ఏలో ఏలో ఏలేలేలో ఏలో ఏలో ఏలో
పొగడాకు తేనెలతో పొదరిల్లు కడిగేసి
రతనాల రంగులతో రంగవల్లుల్లు తీర్చి
ఎదలోనా పీటేసి ఎదురొచ్చికూర్చుంటే
సొదలేమిటే రామ చిలుకా
సొగసిచ్చుకో సిగ్గుపడక
విరజాజి రేకులతో
విరిసయ్య సవరించి
పండువెన్నెల తెచ్చి
పన్నీరు చిలికించి
నిదరంతా మింగేసే నిశిరాత్రి తోడుంటే
కొదవేమిటే గోరువంక
కడకొంగుతో కట్టుపడక
చిత్రం : ఖైదీ (1983)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల