హే గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
సెప్పాలంటే సిగ్గు కదయ్యా ..
ఆ .. ఆనవాళ్ళు నే సెబుతానయ్యా
సెప్పు సెప్పూ
సిగలో నెలవంక, మెడలో నాగరాజు (2)
ఆ రేడు నావాడు సరిరారు వేరెవరూ
మావయ్యా నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా,
మావయ్యా నా మొగుడెవరయ్యా
ఇల్లూవాకిలి లేనీవాడులే నీ వాడూ .. లేనీవాడు
బిచ్చమెత్తుకొని తిరిగేవాడు .. మాదా కవళం
ఇల్లూవాకిలి లేనీవాడు బిచ్చమెత్తుకొని తిరిగేవాడు
ఎగుడూదిగుడు కన్నులవాడు జంగందేవర నీ వాడా
(గౌరమ్మా నీ మొగుడెవరమ్మా)
ఆకాశమే ఇల్లు లోకమే వాకిలీ .. అవునూ
బిచ్చమడిగేది భక్తి .. బదులు ఇచ్చేది ముక్తి (2)
బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి
బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు
(మావయ్యా నా మొగుడెవరయ్యా)
మొగుడు మొగుడనీ మురిసావే, కులికావే, పొగిడావే (2)
పిల్లోయ్ నెత్తిని ఎవరినొ ఎత్తుకొనీ నిత్యం దానినె కొలుచునట
అదియే ఆతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే .. కోతలు ఎందుకు కోస్తావే
(గౌరమ్మో నీ మొగుడెవరమ్మా)
ఎవరో పిలిస్తె వచ్చిందీ, ఎవరికోసమో పోతోందీ,
మయాన్న మజిలీ యేసింది
మయాన్న మజిలీ యేసింది
సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే (2)
పళ్ళు పదారూ రాలునులే .. పళ్ళు పదారూ రాలునులే
మావయ్యో నా మొగుడెవరయ్యా, ఎవరయ్యా వేరెవరయ్యా
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
మావయ్యా
గౌరమ్మా
చిత్రం : మూగ మనసులు (1964)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, పి.సుశీల
****************************************
Movie Name : Mooga Manasulu (1964)
Music Director : K.V.Mahadevan
Lyricist : Aatreya
Singers : Ghantasala, P.Susheela