పల్లవి :
చైత్రము కుసుమాంజలి... ఆ...
చైత్రము కుసుమాంజలి...
పంచమ స్వరమున ప్రౌఢకోకిలలు
నిసగ సగమ గమ
పసనిప మపగా
పంచమస్వరమున ప్రౌఢకోకిలలు
పలికే మరందాల అమృతవర్షిణి పలికే మరందాల అమృతవర్షిణి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చరణం : 1
వేసవిలో అగ్నిపత్రాలు రాలి
విరహిణి నిట్టూర్పులా కొంతసాగి
గగగా దసనిదమగ సరిగా
దాద సాస గాగ మాద మదసా
॥
జలద నినాదాల
పలుకు మృదంగాల (2)
వాసుక జలకన్యలా తేలి ఆడె
నర్తనకు కీర్తనకీ నాట్యకళాభారతికి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చరణం : 2
శయ్యలలో కొత్త ఒయ్యారమొలికే
శరదృతు కావేరీలా తీగసాగి
గగగా దసనిదమగ సరిగా
దాద సాస గాగ మాద మదసా
॥
హిమజలపాతాల
సుమశర బాణాల (2)
మరునికి మర్యాదలే చేసి చేసి
చలిరుతువే సరిగమలౌ
నాదసుధామధువనికి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చిత్రం : ఆనందభైరవి (1984)
రచన : వేటూరి
సంగీతం : రమేష్‌నాయుడు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
హాస్యబ్రహ్మగా పేరుపొందిన జంధ్యాలకు దర్శకునిగా ఇది తొమ్మిదవ చిత్రం.
ఈ చిత్రం ద్వారా జంధ్యాల ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకుడిగా జాతీయఅవార్డును అందుకున్నారు. కొండముది శ్రీరామచంద్రమూర్తి రచించిన ‘చిరుమువ్వల మరుసవ్వడి’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.