పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా
చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే !
నిను కన్నతల్లైన నువు కోరకుండా..
పీఠేసి బ్రతిమాలి వడ్డించదంట
నీ ఇంటిలో ఉన్న నీ అద్దమైనా
నీవెదుట నిలవందె నిను చూపదంటా
మనసున భావాలు ఎన్నెన్ని ఉన్నా
పెదవులు తెరవందే చేరవు బంధాలు
పిరికోళ్ళ ప్రేమలన్నీ మూగోళ్ళ పాటలులే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా
చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే !
పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా
ఎదలోన ఆశున్న నీకేది లాభం
అది నీటిపై రాత నీ బ్రతుకు శాపం
మది దాటిరాలేని నీలోని భావం
వర్షాలు ఈలేని ఆకాశ మేఘం
తెలిపేటి ధైర్యం కొందరికి రాదూ
ధైర్యం లేదంటె అనుకున్నది కాదూ
వెలిరాని ఆశలన్నీ మీటని వీణియలే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా
చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే !
పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా
చిత్రం: హృదయం (1992)
సంగీతం : ఇళయరాజా
రచన :రాజశ్రీ
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం