పూర్తిపేరు : కొసరాజు రాఘవయ్య చౌదరి
జననం : 23-06-1905,
జన్మస్థలం : గుంటూరు జిల్లా బాపట్ల తాలుకా చింతాయపాలెం గ్రామం
తల్లిదండ్రులు : లక్ష్మీదేవమ్మ, సుబ్బయ్య
తోబుట్టువులు : అక్క (వెంకట గిరమ్మ), చెల్లెలు (అరవిందం)
భార్య : సీతారామమ్మ,సంతానం : కుమారుడు భానుప్రసాద్
తొలిచిత్రం-పాట : రైతుబిడ్డ (1939) - నిద్ర మేల్కొనరా తమ్ముడా...,
ఆఖరిచిత్రం - పాట : గురుబ్రహ్మ (1982) - వినరా ఆంధ్రకుమారా (బుర్రకథ),
పాటలు : 800కు పైగా,
ఇతరవిషయాలు : కొసరాజు చింతాయపాలెంలో పుట్టినా పెరిగిందంతా అప్పికట్ల గ్రామం. అక్కడ కొండముది నరసింహం పంతులు దగ్గర వ్యవసాయపు పనులు చేస్తూ ఆయన గురుకులంలో విద్యనభ్యసించారు. 1925-27 మధ్యకాలంలో ‘దేశాభిమాని’ పత్రికలో పనిచేశారు. 1931లో కర్షకోద్యమం ప్రారంభమైన సందర్భంగా తిరుత్తణి ప్రాంత రైతులను ఉత్తేజపరచడానికి ‘కడగండ్లు’ అనే గేయాలు రాశారు. 1932 ఆంధ్రప్రాంతం తుపానుకు గురైనపుడు, 1936లో తిరుత్తణిలో రైతుల సభ జరిగినపుడు రైతుల పక్షాన నిలబడి అందరిలో చైతన్యాన్ని కలిగించారు. ఆ సందర్భంగా అప్పటి పార్లమెంట్ స్పీకరు అనంతశయనం అయ్యంగార్ కొసరాజును ‘కవిరత్న’ బిరుదుతో సత్కరించారు. 1968లో ‘జానపద కవి సార్వభౌమ’, 1984లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1985లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ... ఇలా ఎన్నో సత్కారాలను, పురస్కారాలను అందుకున్నారు.
కొసరాజు ముని మనమరాలైన కొసరాజు నయనతార ఈ మధ్యనే అన్నమయ్య కీర్తనలు ఆలపించి వాటిని సీడీ రూపంలో విడుదల చేశారు. కొసరాజు అన్ని రకాల పాటలను రాసినా... సంగీతాభిమానులకు మాత్రం జానపద గేయరచయితగానే గుర్తుండిపోయారు.
మరణం : 27-10-1986