రుందదానిదని నానానే తన్నానే తన్నానే యే
రుందదానిదని నానానే తన్నానే తన్నానే యే హే
నా మనసంతా ఏదోలా ఉన్నది
నేనేమన్నా అది విననంటున్నది
నాలో కూడా ఏదో మొదలయినదీ
ఏమ్చెయ్యాలో అర్ధం కాకున్నది
నీ రూపమే ఎటు చూస్తూ ఉన్నా
నీ ధ్యాసలో పడిపోతూ ఉన్నా
తలదిండునే నలిపేస్తూ ఉన్నా
నువ్వేననీ ముద్దిస్తూ ఉన్నా
నీ తలపుల వాగులో నా మనసొక పడవలా
మారిందే ఇంతలో ఏమైందో వింతగా
అలుపన్నది ఎరుగనీ గడియారం ముల్లులా
నీ వెనకే నా మదీ తిరిగిందే కొత్తగా
నిను చూస్తుంటే అస్సలు కునుకే రాదే
నీతో ఉంటే కాలం గడిచిందే తెలియదులే
చెప్పాలంటే అచ్చం నాకూ అంతే
అంతా అంతా నీ వల్లే .......హే
she is a diamond girl a daimond girl
she is a diamond girl a daimond girl
నా కోసం నేరుగా దిగివచ్చిన తారకా
నీ కన్నా ఎక్కువ నాకెవ్వరు కాదుగా
అనుకోనీ వరముగా నీ చెలిమే అందగా
ఇంకేమీ వద్దుగా నువ్వుంటే చాలుగా
నువ్వే నువ్వే నాకిక అన్నీ నువ్వే
నువ్వే నువ్వే నాలో అణువణువున నిండావే
నువ్వే నువ్వే నాలో ఉన్నది నువ్వే
నువ్వే నువ్వే నచ్చావే
రుందదానిదని నానానే తన్నానే తన్నానే యే
రుందదానిదని నానానే తన్నానే తన్నానే యే హే
చిత్రం : రైడ్ (2009)
సంగీతం : హేమచంద్ర
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : హేమచంద్ర , సునీత